ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డున పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల( Jogulamba Gadwala) జిల్లా మానవపాడు స్టేజి సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి బోరెల్లి గ్రామం నుంచి మానపాడులోకి రోడ్డుకు అడ్డంగా వెళ్తున్నాడు. ఇదే క్రమంలో కర్నూల్ నుంచి హైదరాబాద్‌కి వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను తప్పించే క్రమంలో అదుపు తప్పి హైవే పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.
బస్సులో 20 మందికిగా పైన ప్రయాణికులు ఉండగా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా, ద్విచక్ర వాహనం దారుడికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.