తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అదే సమయంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడుతుండడంతో ఉష్ణోగ్రతుల పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో ఆదివారం నుంచి సోమవారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.
మే నాటికి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని, దీని ఫలితంగా ఉత్తర, మధ్య భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటింది. రాబోయే వారంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు దాదాపుగా 50డిగ్రీలకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అదే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలేవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది.
హైదరాబాద్‌లో కూడా ఈ వారం మొత్తం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అత్యధికంగా 42-43 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందన్నారు.