AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్‌లోకి హైదరాబాద్

ఐపీఎల్ 2024 సీజన్‌లో గురువారం ఉప్ప‌ల్ స్టేడియం వేదకిగా జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఆగిపోయింది. హోం గ్రౌండ్ లో గుజరాత్ టైటన్స్ తో… సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడాల్సి ఉండగా.. వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

సాయంత్రం నుంచి చిరుజల్లు కురుస్తున్నా.. రాత్రి కాసేపు వర్షం నిలిచిపోవడంతో కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందని అభిమానులు ఆశించారు. కానీ కొద్దిసేపట్లోనే మళ్లీ వర్షం తిరిగి ఆరంభమవడంతో ఇక మ్యాచ్ జరిగే అవకాశం లేదని తేల్చేసిన అంపైర్లు.. ఇరు జట్లకి చెరొక పాయింట్ ఇచ్చేసి మ్యాచ్‌ని రద్దు చేశారు.

దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్లే ఆఫ్‌కు చేరుకుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. నేటి మ్యాచ్ రద్దు కావడంతో ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో ఒక పాయింట్ వచ్చింది. దీంతో 15 పాయింట్లు తో మూడ‌వ స్థానానికి చేరుకుంది. ఇక‌ పంజాబ్ కింగ్స్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ లో గెలిస్తే టాప్-2 స్థానం ఖాయం అవుతుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10