AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

షాపు గోడను ఢీకొట్టిన చేపల లారీ.. తర్వాత ఏం జరిగిందంటే?

లక్నో: చేపలు రవాణా చేస్తున్న మినీ లారీ అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న ఒక షాపు వైపు దూసుకెళ్లింది. అక్కడి గోడను ఢీకొట్టింది. దీంతో ఆ లారీలో ఉన్న బతికున్న చేపలు అక్కడ చెల్లాచెదురుగా పడ్డాయి. ఇది చూసిన స్థానికులు వాటిని ఎత్తుకెళ్లారు. (People loot fish) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్‌నగర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

నవంబర్ 21న మోహనాలోని దఫాలిపూర్ పెట్రోల్ బంక్‌ సమీపంలోని క్రాస్‌రోడ్‌ వద్ద షాపు బయట ఇద్దరు వ్యక్తులు కుర్చీల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అదుపుతప్పిన మినీ లారీ వేగంగా వారి వైపు దూసుకొచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఆ ఇద్దరు వ్యక్తులు వెంటనే కుర్చీల నుంచి లేచి పక్కకు పరుగెత్తారు.

కాగా, దూసుకొచ్చిన ఆ మినీ లారీ అక్కడున్న షాపు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి ఆ లారీలో తరలిస్తున్న సజీవ చేపలు చెల్లాచెదురుగా అక్కడ పడ్డాయి. స్థానికులు, ఆ రోడ్డున వెళ్లేవారు ఇది చూశారు. గుంపుగా అక్కడకు చేరుకున్నారు. చెల్లాచెదురుగా కింద పడిన బతికున్న చేపలను పట్టుకుపోయారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10