AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం.. నేడు అరెస్ట్‌ చేసే అవకాశం

కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  శుక్రవారం అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్‌ అరెస్టవుతారనే వార్తలతో ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు.

ఫార్ములా ఈ కార్ రేసింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.  A1గా కేటీఆర్‌, A2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, A3గా HMDA చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్‌ శర్మ పర్మిషన్‌ ఇవ్వడంతో రేవంత్‌ సర్కార్‌ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే ఆయనపై గురువారం కేసు నమోదైంది. ప్రస్తుతం కేటీఆర్ అరెస్టులు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కేటీఆర్‌ అరస్టవుతారనే వార్తలతో ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. మరోవైపు అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు. కేటీఆర్‌ను అరెస్టు చేసే క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అరెస్టు చేసే సమయానికి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కేటీఆర్‌పై కేసుకు సంబంధించి ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. ” రాజకీయంగా ఎదుర్కొనే దమ్మ లేక బీఆర్ఎస్‌, కేసీఆర్‌ను టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అసెంబ్లీలో చర్చలకు ధైర్యం చేయని సీఎం రేవంత్.. తప్పుడు, అక్రమ కేసులతో కేటీఆర్‌ను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. సీఎం రేవంత్ దయచేసి తెలుసుకోండి. మేము కేసీఆర్ సైనికులం. తెలంగాణ ఉద్యమ పొరాటం నుంచి పుట్టాము. మీ చిల్లర వ్యూహాలు మమ్మల్ని భయపెట్టలేవు. అవి మమ్మల్ని మరింత బలవంతులుగా చేస్తాయి. మేము పోరాడుతాం. తెలంగాణ స్పూర్తి గెలుస్తుందని” కవిత రాసుకొచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10