తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. తీరొక్క పూలతో అంగరంగ తీర్చిదిద్దిన బతుకమ్మలు కొలువుదీరాయి. తొలిరోజు ఎంగిలి పువ్వు పండుగను తెలంగాణలో సంబురంగా షురూ అయ్యాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను అలంకరించారు. సాయంత్రం బతుకమ్మలను ఒకేచోటకు చేరి ఉయ్యాల పాటలతో హోరెత్తించారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ కోలాహలంగా పండుగను జరుపుకున్నారు. బతుకమ్మ అంటేనే ప్రకృతిని పూజించే.. పూలనే కొలిచే పండుగ. హన్మకొండలోని వెయ్యి స్తంభాల గుడిలో వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. బతుకమ్మలతో వేయి స్తంభాల ఆలయానికి మహిళలు పోటెత్తారు. ఉయ్యాల పాటలతో వేయి స్తంభాల ఆలయం మారుమోగింది. అలాగే, హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లు సంబరాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు, జీహెచ్ఎంసీలు సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేశాయి.