AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్కూటీని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే?

లక్నో: వేగంగా వెళ్తున్న కారు ఒక స్కూటీని ఢీకొట్టింది. కారు ముందు పడిన దానిని కిలో మీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లింది.   దీంతో రోడ్డుపై స్కూటీ రాపిడికి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. పీజీఐ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ పథ్‌ వద్ద వంతెనపై వేగంగా వెళ్తున్న కారు ఒక స్కూటీని ఢీకొట్టింది. అయితే డ్రైవర్‌ ఆ కారును నిలుపలేదు. కొందరు వ్యక్తులు అలెర్ట్‌ చేసినా పట్టించుకోలేదు. కారు ముందు పడిన స్కూటీని కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. దీంతో రోడ్డుపై రాపిడికి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి.

కాగా, స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడ్ని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన చంద్రప్రకాష్‌గా గుర్తించారు. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10