వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం (మోదీ 3.0) తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే ఈసారి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా రైతులు, వేతన జీవులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చేపడుతుందని ఆశిస్తున్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి కేంద్ర బడ్జెట్ సమర్పించి రికార్డు సృష్టించనున్నారు.
కేంద్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రి వర్గం పద్దుకు ఆమోదం తెలిపింది. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.
పార్లమెంటుకు బడ్జెట్ కాపీలు..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ట్యాబ్‌తో పార్లమెంటులోకి వచ్చారు. ఇప్పటికే బడ్జెట్ డాక్యుమెంట్లు కూడా పార్లమెంటుకు చేరుకున్నాయి. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు.
పీఎం కిసాన్ పంట సాయం పెంపు..?
ఈసారి బడ్జెట్‌లో అన్నదాతలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీఎం కిసాన్ స్కీమ్ కింద పంట సాయాన్ని రూ. 6 వేలుగా ఉండగా దీనిని రూ. 8 వేలకు పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 8 వేలు..
ఆర్థిక శాఖ కార్యాలయానికి నిర్మలమ్మ..
ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ.. నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు.
మొబైల్ యాప్..
కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ పత్రాల్ని సామాన్యులు కూడా యాక్సెస్ చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఒక మొబైల్ యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్, iOS యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా www.indiabudget.gov.in ద్వారా బడ్జెట్ పత్రాల్ని పొందొచ్చు. నిర్మలమ్మ ప్రసంగం పూర్తయ్యాక ఇవి డాక్యుమెంట్ రూపంలో అందుబాటులోకి వస్తాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ చూడండి. బడ్జెట్ లైవ్ స్ట్రీమింగ్, మొబైల్ యాప్..
నిర్మలమ్మ రికార్డు..
2019 నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతాారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ వస్తున్నారు. ఈసారి బడ్జెట్‌తో వరుసగా ఏడోసారి పద్దు సమర్పించిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సాధించనున్నారు. ఇప్పటివరకు మొరార్జీ దేశాయ్ మాత్రమే వరుసగా ఆరు సార్లు బడ్జెట్ సమర్పించి నిర్మలమ్మతో సమంగా ఉన్నారు. ఇప్పుడు నిర్మలమ్మ దానిని అధిగమించనున్నారు. ఇంకా బడ్జెట్ సుదీర్ఘ ప్రసంగం కూడా నిర్మలమ్మ పేరిటే ఉంది. 2020 సమయంలో ఆమె సుదీర్ఘంగా 2 గంటల 40 నిమిషాల సేపు ప్రసంగించడం విశేషం.