AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్‌తో తలసాని భేటీ

సోదరుడి కుమార్తె వివాహానికి రావాలంటూ ఆహ్వానం
పీసీసీ చీఫ్‌ వ్యాఖ్యల వేళ వీరిరువురి భేటీపై ఆసక్తికర చర్చ
త్వరలో ముగ్గురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హస్తం గూటికి .!

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని సనత్‌ నగర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మంగళవారం కలిశారు. రేవంత్‌ నివాసానికి వచ్చిన తలసాని తన సోదరుడి కుమార్తె వివాహానికి రావాలని శుభలేఖ ఇచ్చారు. అనంతరం సీఎం షేక్‌ హ్యాండ్‌ తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తన మనవరాలి పెళ్లికి రేవంత్‌ రెడ్డిని ఆహ్వానించారు. అయితే ఇటీవల పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ చెందిన కొంత మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌తో టచ్‌ లోకి వచ్చారని చెప్పారు. దీంతో బీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అయింది. ప్రస్తుతం ఎలాంటి చేరికలు జరగలేదు. కానీ చేరికలు ఉంటాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలోకు హైకోర్టులో అనుకూలంగా తీర్పు రావడంతో ఫిరాయింపులు ఊపందుకునే అవకాశం ఉంది. ఫిరాయింపులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్‌ సరైన టైమ్‌ లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో పార్టీ మారే వారికి మార్గం సుగమం అయింది. అయితే పార్టీ మారే యోచనలో ఉన్నవారితో బీఆర్‌ఎస్‌ బాస్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

త్వరలో కాంగ్రెస్‌లోకి ముగ్గురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు..
ముగ్గురు ఎమ్మెల్యే పార్టీ మారడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ మారే ఎమ్మెల్యేల్లో ఒకరు గొర్రెల పథకంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో ఎమ్మెల్యేకు విద్యాసంస్థలు ఉన్నాయి. వీరిద్దరు పార్టీ మారితేనే సమస్యలు రావని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మూడో ఎమ్మెల్యే ఎవరు అని తెలియాల్సి ఉంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ లో చేరిన వారిలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైతరాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజేంద్ర నగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పటాన్‌ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారాడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. పార్టీ మారిన వారిలో ఒకరికి మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైనట్లు సమాచారం. గ్రేటర్‌ హైదరాబాద్‌ లో కాంగ్రెస్‌ బలం పెంచుకునేందుకు ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నట్లు చెబుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10