AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ బడ్జెట్‌: ఏ పథకానికి ఎన్ని నిధులు కేటాయించారంటే..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. తెలంగాణ అప్పులు పదేళ్లలో రూ.75,577 కోట్ల నుంచి రూ. 6,71,751 కోట్లకు పెరిగాయన్నారు.

తెలంగాణ బడ్జెట్: రూ.2,91,159 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.2,20,945 కోట్లు
మూలధన వ్యయం: రూ.33,487 కోట్లు
పన్ను ఆదాయం: రూ.1,38,181 కోట్లు
పన్నేతర ఆదాయం: రూ.35,208 కోట్లు
కేంద్రపన్నుల్లో వాటా: రూ.26,216 కోట్లు
కేంద్రం గ్రాంట్లు: రూ.21,636 కోట్లు

ఏ పథకానికి ఎంత?
రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం: రూ.723 కోట్లు
గృహజ్యోతి పథకం: రూ.2,418 కోట్లు
ఉద్యానవనం: రూ.737 కోట్లు
పశుసంవర్ధక శాఖ: రూ.1,980 కోట్లు
విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ: రూ.100 కోట్లు
హైదరాబాద్ నగర అభివృద్ధి: రూ.10 వేల కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు: రూ.500 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు: రూ.1500 కోట్లు
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు: రూ.1525 కోట్లు
మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్సుపోర్ట్ సిస్టమ్: రూ.50 కోట్లు
ఔటర్ రింగ్ రోడ్డు: రూ.200 కోట్లు
మెట్రో వాటర్ వర్క్స్: రూ.3,385 కోట్లు
హైడ్రా: రూ.200 కోట్లు
జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పన: రూ.3,065 కోట్లు
హెచ్ఎండీఏలో మౌలిక వసతుల కల్పన: రూ.500 కోట్లు
ప్రజాపంపిణీ: రూ.3,836 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి: రూ.29,816 కోట్లు
బీసీ సంక్షేమం: రూ.9,200 కోట్లు
వైద్యం, ఆరోగ్యం: రూ.11,468 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కంలు: రూ.16,410 కోట్లు
అడవులు, పర్యావరణం: రూ.1,064 కోట్లు
ఎస్టీ సంక్షేమం: రూ.17,056 కోట్లు
మైనార్టీ సంక్షేమం: రూ.3,003 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమం: రూ.2,736 కోట్లు
ఎస్సీ సంక్షేమం: రూ.33,124 కోట్లు
ఐటీ రంగం: రూ.774 కోట్లు
నీటి పారుదల శాఖ: రూ.22,301 కోట్లు
ఆర్ అండ్ బీ: రూ.5,790 కోట్లు
పరిశ్రమల శాఖ: రూ.2,762 కోట్లు
విద్యారంగం: రూ.21,292
హోంశాఖ: రూ.9,564 కోట్లు
వ్యవసాయం: రూ.72,659 కోట్లు
ఇందిరా మహిళా శక్తి పథకం: రూ.50.41 కోట్లు

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10