AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. వాటి మీదే ఫోకస్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై స్పష్టత వచ్చింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది. సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కారు ప్లాన్ చేస్తోంది. ఆర్ఓఆర్ చట్టాన్ని ఆమోదించాలని చూస్తోంది. రైతు, కులగణన సర్వేపై కూడా సమావేశాల్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలతో పాటు మంత్రివర్గ విస్తరణ మీద కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది.

సర్పంచ్ ఎన్నికలు అప్పుడే..

డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ సర్కార్‌ ఏడాది కాలం పూర్తి చేసుకోనుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిసింది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వినిపిస్తోంది. కానీ ఆలోపే మంత్రివర్గాన్ని విస్తరించేందుకు కసరత్తు జరుగుతోందని కూడా సమాచారం అందుతోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలపై కూడా గవర్నమెంట్ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలని భావిస్తోందట.

పెన్షన్ పెంపుపై నిర్ణయం..

పంచాయతీ ఎన్నికలకు ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచేందుకు రేవంత్ సర్కారు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎలక్షన్స్‌కు ముందు పెన్షన్, రైతు భరోసాను పెంచితే ప్రభుత్వానికి మంచి పేరుతో పాటు పార్టీకి మైలేజీ వస్తుందని భావిస్తున్నారట. అసెంబ్లీ సమావేశాలు, పంచాయతీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్.. ఇంకోవైపు ప్రతిపక్షాలను కూడా టార్గెట్ చేయాలని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే కొండపోచమ్మ సాగర్ దగ్గరలోని మాజీ మంత్రి హరీష్ రావు ఫామ్‌హౌస్‌పై విచారణ జరిపించాలని డిసైడ్ అయ్యారట.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10