కాన్‌బెర్రా : అడిలైడ్‌లో డే అండ్ నైట్ టెస్టుకు సిద్ధమవుతున్న భారత జట్టుకు ఆ మ్యాచ్ ఆరంభానికి ముందు మరో విజయం దక్కింది. ప్రైమ్ మినిస్టర్ లెవెన్‌తో కాన్‌బెర్రాలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు రోజుల ఆటలో భాగంగా తొలి రోజు వర్షార్ఫణమవగా రెండో రోజూ వరుణుడి అంతరాయంతో మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన పీఎం ఎలెవెన్.. 43.2 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆ జట్టు ఓపెనర్ సామ్ కొన్సస్ (97 బంతుల్లో 107, 14 ఫోర్లు, 1 సిక్స్), హన్నో జాకబ్స్ (61) రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా (4/44), ఆకాశ్ దీప్ (2/58) మెరిశారు. అనంతరం భారత్.. 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. నిర్ణీత ఓవర్ల కంటే ముందే టీమ్‌ఇండియా మ్యాచ్ గెలిచినా ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో పూర్తి ఓవర్ల పాటు ఆడించారు. పెర్త్ టెస్టుకు ముందు వేలిగాయంతో దూరమైన శుభ్‌మన్ గిల్ (62 బంతుల్లో 50 రిటైర్డ్ హర్ట్, 7 ఫోర్లు) ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అడిలైడ్ టెస్టుకు తాను సిద్ధమేనని చెప్పకనే చెప్పాడు. యశస్వీ జైస్వాల్ (45), నితీశ్ రెడ్డి (42), వాషింగ్టన్ సుందర్ (42 నాటౌట్) భారత విజయంలో కీలకపాత్ర పోషించారు.
NITISH KUMAR REDDY TAKING DOWN SPINNERS 🤯
– What a star in making…!!!! pic.twitter.com/XdtbxTHFd4
— Johns. (@CricCrazyJohns) December 1, 2024