AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే ..

కొందరు కంటెంట్‌తో సంబంధం లేకుండా తమకు తోచిన వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. కొందరు యువకులు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొందరు విష సర్పాలతో వింత వింత పనులు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ప్రేయసితో ఫోన్‌లో బిజీబిజీగా మాట్లాడుతుంటాడు. ఈ క్రమంలో ఓ పాము సడన్‌గా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో   తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు (young man) పార్కులో నేలపై కూర్చుని తన ప్రేయసితో ఫోన్‌‌లో మాట్లాడుకుంటుంటాడు. చుట్టూ ఏం జరుగుతుందో అన్న విషయం కూడా పట్టించుకోకుండా ఫోన్‌లో మునిగిపోయి ఉంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది.

ఓ పాము (snake) సడన్‌గా ఆ యువకుడి వైపు దూసుకొస్తుంది. అయితే పాము సమీపానికి వస్తున్నా కూడా అతను పట్టించుకోకుండా ఫోన్‌‌లో మాట్లాడుతూనే ఉంటాడు. ఈ క్రమంలో పాము ఏకంగా అతడి కాళ్ల కిందకు దూరిపోతుంది. తీరా తన కిందకు వచ్చిన తర్వాత చూసుకుని షాక్ అవుతాడు. ఒక్కసారిగా పైకి లేచి, భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. అయితే ఇదంతా చూస్తుంటే వ్యూస్, లైక్‌ల కోసం కావాలని చేసినట్లుగా అనిపిస్తు్నా.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘యువకుడికి చక్కిలిగింతలు పెట్టిన పాము’’.. అంటూ కొందరు, ‘‘కెమెరామెన్లు ఎప్పటికీ సాయం చేయని వారిలా చిరస్థాయిగా నిలిచిపోతారు’’.. అంటూ మరికొందరు, ‘‘సమయానికి గమనించి సరిపోయింది.. లేదంటే ఘోరం జరిగిపోయేది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.40 లక్షలకు పైగా లైక్‌లు, 7.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10