జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. హౌసింగ్ సొసైటీలకు కేటాయించిన భూ కేటాయింపులను రద్దు చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టు సొసైటీలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వాలు భూములు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వాలు బుక్ కేటాయింపులు చేయడాన్ని సవాల్ చేస్తూ రావు బీ చెలికాని సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది.
కాగా, జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 8న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇండ్ల స్థలాల కేటాయింపు పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందించారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హౌసింగ్ సొసైటీలు పొందిన భూముల విషయమై సందిగ్ధం నెలకొన్నది.