AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

 రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌–2 పరీక్షలు షురూ.. అరగంట ముందే గేట్లు క్లోజ్‌

 

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌–2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు తొలి రోజు తొలి పరీక్ష ప్రారంభమైంది. పరీక్షకు గంట ముందుగానే ఎగ్జామ్‌ సెంటర్‌కు రావాలని టీజీపీఎస్పీ సూచించింది. అలాగే 9:30 గంటల తర్వాత గేట్లు క్లోజ్‌ చేస్తామని తెలిపారు. దీంతో చాలామంది అభ్యర్థులు సమయానికి సెంటర్‌కు చేరుకున్నారు. అయినా కొన్ని చోట్ల అభ్యర్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వచ్చారు. నిమిషం నిబంధన మేరకు వారిని సిబ్బంది ఎగ్జామ్‌ హాలులోకి అనుమతించలేదు. దీంతో కన్నీళ్లతోనే వారు వెనుదిరిగారు.

బుర్రా వెంకటేశం ఆకస్మిక తనిఖీలు..
బేగంపేటలోని మహిళా డిగ్రీ కాలేజీలో గ్రూప్‌ 2 పరీక్ష నిర్వహణను టీజీపీఎస్సీ చైర్మన్‌  బుర్రా వెంకటేశం పరిశీలించారు. గ్రూప్‌–2 పరీక్షకు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత గ్రూప్‌ 2 పరీక్ష జరుగుతుందని.. అభ్యర్థులు ఆందోళన లేకుండా పరీక్ష రాయాలని సూచించారు. గ్రూప్‌ 3 కంటే ఎక్కువ శాతం మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారని పేర్కొన్నారు.

నాలుగు పేపర్లు..
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తొలి సెషన్‌లో పరీక్ష జరగనుంది. రెండో సెషన్‌లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు పరీక్ష నిర్వహించనున్నారు. నాలుగు పేపర్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది మార్చిలో ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. కాగా,783 పోస్టుల భర్తీకి కేసీఆర్‌ ప్రభుత్వం గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ను జారీచేయగా, పలు కారణాలతో పరీక్ష నాలుగుసార్లు వాయిదాపడింది. ఈ పరీక్ష కోసం 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో లక్షకు పైగా అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోలేదని తెలుస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10