పోలవరానికి సైతం పూర్తి సహకారం..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్
(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్∙గుడ్ న్యూస్ చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందిచనున్నట్లు తెలిపారు. 2024–25 బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల రూపాయిల నిధులు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
పోలవరానికి ప్రత్యేక సాయం..
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహాయం చేస్తామన్నారు. అలాగే, పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు. విశాఖ–చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు చెప్పారు. విభజన చట్టంలో పొందుపర్చినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. ఏపీ విభజన చట్టం అమలుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామన్నారు.