ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో షాక్ తగిలింది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయనను ఈడీ అరెస్ట్ చేయకుండా తాము ఆదేశాలు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ 9 సార్లు నోటీసులు పంపింది. అదే విధంగా షెడ్యూల్ ప్రకారం ఈడీ విచారణకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈడీ విచారణకు కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అలాగే తనను అరెస్టు చేయకూడదని హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగగా.. ఈడీ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ను విచారణకు మాత్రమే పిలుస్తున్నామని ఈడీ అభిప్రాయపడింది. ఆయనను అరెస్టు చేయడానికి పిలవడం లేదని, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతోంది చెప్పలేమని ఈడీ పేర్కొంది.