AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన శిఖ‌ర్ ధావ‌న్‌

న్యూఢిల్లీ: దేశీయ‌, అంత‌ర్జాతీయ క్రికెట్‌కు శిఖ‌ర్ ధావ‌న్  గుడ్‌బై చెప్పారు. 14 ఏళ్ల కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. సోష‌ల్ మీడియా పోస్టు ద్వారా ధావ‌న్ త‌న రిటైర్మెంట్‌ను ప్ర‌క‌టించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున ఐపీఎల్‌లో చివ‌రి టోర్నీ ఆడాడు. శిఖ‌ర్ ధావ‌న్ త‌న కెరీర్‌లో మొత్తం 24 సెంచ‌రీలు చేశాడు.

దాంట్లో 17 వన్డేల్లో, ఏడు టెస్టుల్లో చేశాడు. త‌న కెరీర్‌లోని క్రికెట్ అధ్యాయాన్ని ముగిస్తున్న‌ట్లు ఎక్స్ అకౌంట్‌లో ధావ‌న్ వెల్ల‌డించాడు. రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తూ ఓ వీడియోను పోస్టు చేశాడు. ఎన్నో జ్ఞాప‌కాల‌ను మోసుకెళ్తున్న‌ట్లు చెప్పారు. మీ ప్రేమ‌, అభిమానానికి థ్యాంక్స్ అంటూ ఆ వీడియోలో తెలిపాడు.

గుండెల్లో శాంతిని నింపుకుని.. క్రికెట్‌కు అల్విదా చెబుతున్న‌ట్లు ధావ‌న్ తెలిపాడు. ఇండియాకు చాలా సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన‌ట్లు వెల్ల‌డించారు. ఇక ఇండియాకు ఆడ‌బోమ‌న్న బాధ అవ‌స‌రం లేద‌న్నారు. దేశానికి ఆడినందుకు సంతోషంగా ఫీల‌వుతున్న‌ట్లు చెప్పారు. శిఖ‌ర్ ధావ‌న్‌కు వ‌న్డేల్లో ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది. 40 ప్ల‌స్ స‌గ‌టుతో.. 90 ప్ల‌స్ స్ట్ర‌యిక్ రేట్‌తో.. వ‌న్డేల్లో 5వేల ప‌రుగులు చేసిన 8 మంది బ్యాట‌ర్ల‌లో అత‌ను ఒక‌డిగా నిలిచాడు. ఈ జాబితాలో ఇండియా నుంచి రోహిత్‌, కోహ్లీ మాత్ర‌మే ఉన్నారు.

ఇండియా త‌ర‌పున శిఖ‌ర్ ధావ‌న్ చివ‌రిసారి డిసెంబ‌ర్ 2022లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో ఆడాడు. త‌న కెరీర్‌లో ఇండియా త‌ర‌పున 34 టెస్టులు, 167 వ‌న్డేలు, 68 టీ20లు ఆడాడు ధావ‌న్‌. టెస్టుల్లో 2315, వ‌న్డేల్లో 6793, టీ20ల్లో 1759 ర‌న్స్ చేశాడత‌ను.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10