AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రంలో ఉద్యమ వీరులకు గుర్తింపు దక్కలేదు.. బీఆర్ఎస్ తీరుపై సీఎం రేవంత్ ఆగ్రహం..

ఉద్యమాల పట్ల చరిత్రకారులు వాస్తవాలను రాయకపోతే అసలైన పోరాట యోధులు, ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల గురించి భవిష్యత్తు తరాలకు అసంపూర్తి సమాచారమే అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందువల్ల వాస్తవాలను సమాజం ముందు ఆవిష్కరించాలంటే కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలని, తమ గళాలను విప్పాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఏర్పాటు చేసిన 37వ పుస్తక ప్రదర్శనను ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించారు. తర్వాత బోయి విజయ భారతి వేదికగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగించారు. చరిత్ర ఎప్పుడూ గెలిచిన వాళ్లు రాసుకునేదే చరిత్రగా ఆవిష్కృతమవుతోందని, పోరాటాల్లో అసులు బాసిన వాళ్లు, అమరులైన వారి గురించి చరిత్రలో కొంత నిర్లక్ష్యం గురికావడం, కొంత సమాచార లోపం ఉంటుందన్నారు.

సాయుధ రైతాంగ పోరాటం, తొలి దశ తెలంగాణ ఉద్యమైనా, మలి దశ తెలంగాణ ఉద్యమమైనా.. ఉద్యమాల్లో సమిధలైన, అమరులైన వారికంటే, రాజకీయంగా ప్రయోజనం పొందిన వారి గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. గత పదేళ్లుగా మన కళ్ల ముందున్న చరిత్రలో వాస్తవాలు, అవాస్తవాలు గమనించి కవులు, కళాకారులు తమ కలాలను పదును పెట్టాలి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సమాజం అధునాతన యుగం వైపు, సాంకేతిక పరిజ్ఞానం వైపు వెళుతున్న సందర్భంలో డిజిటల్, సోషల్ మీడియాల వంటి మాధ్యమాల వల్ల ఏది వాస్తవమో, ఏది ఆవాస్తవమో గ్రహించే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. యువతను పుస్తక పఠనంవైపు మళ్లిస్తే వాస్తవాలు తెలుసుకునే వీలుంటుందన్నారు సీఎం రేవంత్. 1985లో సిటీ సెంట్రల్ లైబ్రరీలో చిన్నగా ప్రారంభించిన బుక్ ఫెయిర్ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చేపట్టడం, అందులోనూ ఎంతోమంది మేధావులు పాల్గొని వచ్చే తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. బుక్ ఫెయిర్ నిర్వహకులు ప్రస్తావించిన విషయాలపై ప్రొ. కోదండరాం నివేదిక రూపంలో అందజేస్తే వాటిని పరిశీలించి సామాజిక బాధ్యతగా నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ చెప్పారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10