ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య నివాసానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెళ్లారు. బుధవారం చుక్కా రామయ్య పుట్టిన రోజు నేపథ్యంలో ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చేత సీఎస్ కేక్ కట్ చేయించారు. పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు చుక్కా రామయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చుక్కారామయ్య నివాసానికి వెళ్లి బర్త్ డే విషెస్ చెప్పారు.
గతంలో సీఎం పరామర్శ:
కొంత కాలంగా చుక్కా రామయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గత మే లో సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. చుక్కా రామయ్యను సత్కరించి జూన్ 2న జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించి వచ్చారు.