రాజస్థాన్‌కు చెందిన 1990 బ్యాచ్ IAS అధికారి సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ 26వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా వరుసగా రెండు పర్యాయాలు పూర్తి చేసిన శక్తికాంత దాస్ మంగళవారం పదవీవిరమణ చేశారు. ఈ క్రమంలో శక్తికాంత దాస్ పదవి నుంచి వైదొలగడంతో, సంజయ్ మల్హోత్రా (Sanjay malhotra) డిసెంబర్ 11న బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో సంజయ్ మల్హోత్రా ఈరోజు ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకోగా, అక్కడ ఆయనకు సీనియర్ అధికారులు ఘన స్వాగతం పలికారు. సంజయ్ మల్హోత్రా ఈ పదవిలో 3 సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో సంజయ్ మల్హోత్రాతో పాటు డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్, ఎం. రాజేశ్వర్ రావు, టీ రబీ శంకర్ కూడా ఉన్నారు.
3 దశాబ్దాల అనుభవం
రాజస్థాన్‌కు చెందిన 1990 బ్యాచ్ IAS అధికారి అయిన సంజయ్ మల్హోత్రా పవర్, ఫైనాన్స్, టాక్సేషన్ వంటి ప్రధాన రంగాలలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. అయితే దేశం ద్రవ్యోల్బణంతో పాటు ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న తరుణంలో సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవర్, ఫైనాన్స్, టాక్సేషన్ వంటి ప్రధాన రంగాలలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సంజయ్ దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.