మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి ఆదివారం కేసీఆర్ దగ్గరకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి ఆయనతో సమావేశమయ్యారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ సభ్యులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు ఇతర మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచేలా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడిన కేసీఆర్.. ఆ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డితో కూడా కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించినట్లు సమాచారం.