శభాష్ సీతక్క.. మంత్రిగా బాగా పనిచేస్తున్నావు. స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ బాగుంది. ఇదే ఒరవడిని కొనసాగించు. మంచి పేరు వస్తుంది. కొత్తగా మంత్రివైనా.. మీ నేతృత్వంలో పంచాయతీరాజ్ గ్రామీనాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖల పనితీరులో కొత్తదనం కనిపిస్తోంది…అంటూ మాజీ మంత్రి గీతారెడ్డి మంత్రి సీతక్కను ప్రశంసించారు. మాదాపూర్ లో రూరల్ విమెన్ లీడర్షిప్ ప్రోగ్రాం ప్రారంభ సందర్భంగా..గీతా రెడ్డి అభినందించడం తో సీతక్క ధన్యవాదాలు తెలిపారు.