AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎస్‌కే కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 17 వ సీజన్‌కు సీఎస్‌కే కొత్త కెప్టెన్‌ నియమించింది. నూతన కెప్టెన్‌గా టీమిండియా డైనమిక్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను నియమించారు. దీంతో ధోని అభిమానులకు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తొలిసారిగా సీఎస్‌కే జట్టు తరుపున కెప్టెన్‌ పగ్గాలు చేపట్టబోతున్నాడు. ధోని కెప్టెన్సీ వదులుకుని యువ ఆటగాడు గైక్వాడ్‌కు అప్పగించినట్లు చెన్నై సూపర్ కింగ్స్ మెనేజ్మెంట్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలిపింది. అదే విధంగా ట్రోఫీలో ఆయా ఫ్రాంచైజీల కెప్టెన్‌తో ఫోటో షూట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆ ఫోటో షూట్‌తో సీఎస్‌కే తరుపున యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ సందడి చేశాడు.

ఇక 2008 నుంచి ధోని చెన్నై తరఫున మొదటి నుంచి కొనసాగుతూ వచ్చాడు. అయితే గతంలో చెన్నై తరపున ఆడుతున్న రవీంద్ర జడేజాకు బాద్యతలు అప్పగించిన తర్వాత మళ్లీ ఆయనే కెప్టెన్ పగ్గాలు తీసుకున్నాడు. దోని ఇప్పటి వరకు చెన్నై తరుపున 212 మ్యాచ్‌లకు కెప్టెన్సీగా వ్యవహారించాడు. అందులో 128 మ్యాచ్‌ల్లో విజయాలను అందించగా.. అలాగే 82 మ్యాచ్‌ల్లో ఓటమిని ఎదుర్కొంది. అదే విధంగా 12 సార్లు ప్లే ఆప్‌కు చేరుకోగా.. 10 సార్లు ఫైనల్‌కు వెళ్లింది సీఎస్‌కే జట్టు. ఐసీఎల్ సీజన్‌లో ధోని సారథ్యంతో ఐదు సార్లు కప్పు అందించాడు. అందులో 2010, 2011, 2018, 2021, 2023 కాలంలో ఐపీఎల్‌ కప్పును ధోని సారథ్యంతో లభించింది. రేపటి నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్ ఆర్సీబీతో సీఎస్‌కే మధ్య తొలి పోరు జరగబోతుంది. దీంతో తొలి మ్యాచ్‌తోనే కెప్టెన్‌గా రుతురాజ్ కనిపించబోతున్నాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10