AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షలు.. చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం

సింగరేణి కార్మికులకు ఐదు రోజుల ముందుగానే దసరా పండగ వచ్చేసింది. కార్మికులకు ప్రభుత్వం బోనస్ చెక్కులు పంపిణీ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కార్మికులు బోనస్ చెక్కులు అందుకున్నారు. ఈ ఏడాది సింగరేణికి రూ.2412 కోట్ల లాభం రాగా.. అందులో 33 శాతం అంటే రూ.796 కోట్లను కార్మికులకు ప్రభుత్వం బోనస్‌గా ప్రకటించిన సంగతి తెలిసందే. దాదాపు 42 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 1.90 లక్షల చొప్పున బోనస్‌గా అందుకుంటున్నారు. సింగరేణిలో పనే చేసే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఈ ఏడాది రూ. 5 వేల బోనస్ ప్రకటించారు.

చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి.. సంస్థలో ఔట్ సోర్సింగ్, రెగ్యులర్ ఎంప్లాయీస్‌ మధ్య ఖర్చు విషయంలో వ్యత్యాసం చాలా ఉందని అన్నారు. ఈ వ్యాత్యాసాన్ని తగ్గించుకోవానికి సంస్థ ప్రయత్నించాలని సూచించారు. ఒక టన్ను బొగ్గు ఉత్పత్తి చేయడానికి రెగ్యులర్ ఎంప్లాయిస్‌పై రూ.3 వేల నుంచి రూ.9 వేల వరకు ఖర్చు చేస్తుంటే.. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్‌పై మాత్రం రూ.1500- రూ.4,500 వరకు మాత్రమే ఖర్చవుతోందని అన్నారు. కార్మికుల వేతనాల్లో భారీ వ్యాత్యాసం ఉండడం శ్రమ దోపిడీ కిందకే వస్తుందని చెప్పారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10