AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆస్కార్‌ వేదికపై మరోసారి మెరిసిన ఆర్‌ఆర్‌ఆర్‌.. VIDEO

టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR Movie). స్టార్‌ నటులు జూనియర్‌ ఎన్టీఆర్ (Jr NTR)‌, రామ్‌చరణ్‌ (Ram Charan) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఎన్నో రికార్డులను తిరగరాసింది. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డును (Oscar Awards) కూడా సొంతం చేసుకుంది.

ఈ చిత్రం నుంచి గతేడాది జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డుల వేడుకల్లో ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ఆస్కార్‌ వరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్కార్‌ వేడుకల్లో మరోసారి ఈ పాట మెరిసింది. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దృశ్యాలు కనిపించాయి. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటరిగీలో అవార్డును ప్రకటించే సమయంలో తెరపై ‘నాటు నాటు’ పాటను పదర్శించారు. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ వేసిన ‘నాటు నాటు’ హుక్ స్టెప్ విజువ‌ల్స్ క‌నిపించాయి. సాధార‌ణంగా ఏ అవార్డు ఇచ్చినా, నామినీల వివ‌రాల‌తో పాటుగా, గ‌తేడాది ఆ కేట‌గిరిలో అవార్డు పొందిన సినిమా తాలుకూ విజువ‌ల్స్ ప్లే చేయ‌డం ప‌రిపాటి. అలా ‘నాటు నాటు’ పాట‌ని మ‌రోసారి ఆస్కార్ వేదిక‌పై చూసుకొనే అవకాశం తెలుగు సినీ ప్రియులకు దక్కినట్లైంది.

అంతేకాకుండా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని కొన్ని సీన్స్‌ కూడా ఈ వేదికపై తళుక్కున మెరిశాయి. ఇప్పటి వరకూ సినిమాల్లో వచ్చిన బెస్ట్‌ స్టంట్స్‌కు సంబంధించిన సీన్స్‌ను ఓ ప్రత్యేక వీడియో ద్వారా ఈ వేదికపై ప్రదర్శించారు. అందులోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని రెండు యాక్షన్‌ షాట్స్‌ ఇందులో కనిపించడం విశేషం.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10