భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రస్థానం అనితర సాధ్యమని అన్నారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న స్వీయ రాజకీయ పార్టీ అని తెలిపారు. తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీగా పేర్కొన్నారు.
ఈ నేల మేలు కోరేది బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. ప్రతీక్షణం పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన తీరును, లాఠీ దెబ్బలకు భయపడకుండా ముందుకు సాగిన కార్యకర్తల త్యాగాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. ‘తమ పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడువునా రాజీలేని రణం’ అని కేటీఆర్ అన్నారు.