తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరుతున్నారు. తన పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పెద్దలను ఆయన కలవనున్నారు. లోక్ సభ ఎన్నికలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. ఇప్పటికే లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఓ ప్రాథమిక జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. చర్చలో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. దీంతోపాటు, నామినేటెడ్ పోస్టులపై కూడా చర్చలు జరపనున్నారు.
కేబినెట్ విస్తరణపై కూడా హైకమాండ్ తో రేవంత్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేబినెట్ లో చోటు దక్కలేదు. దీంతో, మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ బ్రదర్స్ రేసులో ఉండగా… నిజామాబాద్ జిల్లా నుంచి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు.