తెలంగాణ కులగణన సర్వే చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కులగణన ప్రారంభమైందని… రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సంబంధించిన విధానాలను రూపొందించడానికి ఈ డేటాను వినియోగిస్తామని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోనూ ఇదే జరగనుందని… పార్లమెంట్‌లో ఈ కులగణను ఆమోదించి, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం అడ్డుగోడలను బద్ధలు కొడతామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ… రేవంత్ రెడ్డి స్పందించారు.
తెలంగాణలో ఈరోజు కులాల సర్వే గణన ప్రారంభంతో సరికొత్త విప్లవయాత్రకు శ్రీకారం చుట్టామని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వాగ్దానం మేరకు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం సాకారం కానుందని పేర్కొన్నారు. కులగణన చేపట్టిన కార్యక్రమం చేపట్టిన ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు.