ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ‘పుష్ప2: ది రూల్’ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం సౌత్, నార్త్, ఓవర్ సీస్ లో ఊహించని స్థాయిలో రికార్డు ఓపెనింగ్స్ రాబట్టింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్ల వసూళ్లను సాధించి ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా చరిత్ర సృష్టించింది. తెలుగు స్టేట్స్, నార్త్ లో పుష్ప హవా ఎక్కువగా కనిపిస్తోంది.
రెండు రోజుల్లో రూ. 449 కోట్లు
అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పుష్ప2 రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 449 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేసినట్లు తెలిపారు. అత్యంత వేగంగా రూ. 500 కోట్ల మార్క్ ను చేరుకున్న భారతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ షేర్ చేశారు. రెండో రోజు వసూళ్లు కాస్త తగ్గినప్పటికీ.. 2 రోజుల్లో రూ.400 కోట్లు రాబట్టడం పెద్ద రికార్డు.
దేశవ్యాప్తంగా పుష్ప 2 రెండవ రోజు రూ. 90 కోట్ల వసూళ్లను రాబట్టింది. హిందీ వెర్షన్ లో రూ.55 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.27.1 కోట్లు, తమిళంలో రూ.5.5 కోట్లు, కన్నడలో రూ.60 లక్షలు, మలయాళంలో రూ.1.9 కోట్లు వసూలు చేసింది.