AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గుకేశ్‌కు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచిన గుకేశ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా వారు ట్వీట్ చేశారు.

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా నిలిచినందుకు గుకేశ్‌కు హృదయపూర్వక అభినందనలు… మన దేశం గర్వపడేలా చేశారంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

గుకేశ్ విజయం చారిత్రాత్మకమైనది… ఎంతోమంది యువతకు ప్రేరణనిచ్చేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గుకేశ్ అద్భుతమైన విజయం సాధించారని ప్రశంసించారు. అతడి అసమాన ప్రతిభ, కృషి, సంకల్పాల ఫలితమే ఈ విజయమని పేర్కొన్నారు.

ఈ విజయం చెస్ చరిత్రలో గుకేశ్‌ పేరును సుస్థిరం చేయడమే కాకుండా లక్షలాది మంది యువతకు గొప్ప కలలు కనేందుకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. కాగా, చెస్‌కు, భారత్‌కు, డబ్ల్యుసీఏకు, తనకూ ఇది గర్వించదగ్గ విషయమని విశ్వనాథన్ ఆనంద్ పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10