AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వాయనాడ్‌లో ముగిసిన పోలింగ్‌.. భారీగా తగ్గిన ఓటింగ్‌ శాతం..!

కేరళలోని వాయనాడ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోలింగ్‌ శాతం భారీగా తగ్గింది. ఇవాళ సాయంత్రం పోలింగ్‌ సమయం ముగిసేటప్పటికి వాయనాడ్‌లో కేవలం 60.79 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. క్యూలైన్‌లలో ఉన్న ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత పోలింగ్‌ శాతం కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నా 65 శాతానికి మించకపోవవచ్చని అధికారులు చెబుతున్నారు.

వాయనాడ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 79.77 శాతం పోలింగ్‌ నమోదైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అది 72.69 శాతానికి తగ్గింది. ఈ ఉప ఎన్నికల్లో అది 60 శాతానికి పడిపోయింది. తుది అంచనాలు వచ్చేటప్పటికీ పోల్‌ పర్సెంట్‌ కొంత పెరిగే అవకాశం ఉన్నా.. 65 శాతానికి మించకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆరు నెలల్లోపే రెండోసారి ఎన్నికలు జరుగడంతో వాయనాడ్‌ ఓటర్లు కొందరిలో అనాసక్తి నెలకొన్నట్టు ఈ పోల్‌ పర్సెంట్ స్పష్టం చేస్తున్నది.

కాగా, గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా వాయనాడ్‌ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీచేసి విజయం సాధించారు. 2019లో యూపీలోని అమేథీ, కేరళలోని వాయనాడ్‌ నుంచి పోటీ చేసిన రాహుల్.. అమేథీలో ఓడిపోయారు. వాయనాడ్‌లో గెలిచారు. అయితే 2024లో ఆయన వాయనాడ్‌తోపాటు యూపీలోని రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగారు. ఈసారి రెండు స్థానాల్లో గెలిచారు. దాంతో ఆయన వాయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు.

దాంతో ఖాళీ అయిన వాయనాడ్‌ లోక్‌సభ స్థానానికి ఇవాళ ఉప ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాహుల్ గాంధీ సోదరి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ బరిలో దిగారు. ఈ క్రమంలో పోలింగ్‌ శాతం తగ్గడం కాంగ్రెస్‌ శ్రేణులను కలవరపరుస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10