శంషాబాద్ (Shamshabad ) విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి. ఎయిర్‌పోర్టులో పాములు పట్టుబడటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సోమవారం ఉదయం బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమాన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళల వద్ద విష సర్పాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం ఆ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకాక్ నుంచి పాములు తీసుకొస్తున్న వారిని సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారని అనుమానం వ్యక్తమవుతున్నది. వారిద్దరు పథకం ప్రకారంమే పాములను తీసుకొచ్చారా అనే కోణంలో దర్యాప్తుచేస్తున్నారు.