(అమ్మన్యూస్, హైదరాబాద్):
సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఎంపిక చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయం మేరకు సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు పేరును ఖరారు చేశారు. ఇప్పటి వరకు 14 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి, నల్గొండ, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది.
నాగర్‌కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, వరంగల్ నుంచి కడియం కావ్య పోటీ చేయనున్నారు.