(అమ్మన్యూస్, హైదరాబాద్):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చైర్మన్ ఖలీద్ సైఫుల్లా రహ్మానీ, హైదరా బాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కలిశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై తమ అభిప్రా యాలను సీఎంకి తెలియజేశారు. బిల్లును వ్యతిరేకించాలని కోరారు. టీఎంఆర్ఐఈఎస్ చైర్మన్ ఫహీం ఖురేషీ కూడా పాల్గొన్నారు.