ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ‘దేవర’ థియేటర్లలోకి వచ్చేశాడు. తారక్ నటవిశ్వరూపం, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఈరోజు రాత్రి నుంచి ఎక్కడ చూసిన దేవర అనే పదం హోరేత్తిస్తుంది. ఇక మల్టీ ఫ్లెక్స్ లు,సింగిల్ స్క్రీన్ థియేటర్లయితే అరుపులతో దద్దరిల్లిపోతున్నాయి.. వరల్డ్ వైడ్ వేల థియేటర్లలో రిలీజ్ కావడంతో తొలిరోజు వసూళ్లు గట్టిగానే రాబోతున్నాయని తెలుస్తోంది. తమ హీరో హీరో సినిమా ఆరేళ్ళత థియేటర్లలోకి రావడంతో ఫ్యాన్స్ అత్యుత్సహం ప్రదర్శిస్తున్నారు.. గత రెండు రోజుల నుంచి హంగామా చేస్తూ రచ్చ చేస్తున్నారు.. సినిమా సంగతి పక్కనపెట్టి పెడితే ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు.
కడప అప్సర థియేటర్ లో ఒక అభిమాని సినిమా చూస్తూ మృతి చెందిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఆ విషయం పై ఆందోళన చెందుతున్న సమయంలోనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కటౌట్ మంటల్లో కాలిపోయింది. కావాలని ఎన్టీఆర్ కటౌట్ కి నిప్పు అంటించారని కొందరు ఆరోపిస్తున్నారు. కొందరు మాత్రం అభిమానులు క్రాకర్స్ కాల్చుతున్న సమయంలో నిప్పు రవ్వ లు కటౌట్ మీద పడి మంటలు రాజుకున్నాయి అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
మంటల్లో ఎన్టీఆర్ కటౌట్ పూర్తిగా దగ్దం అయింది. మంటలు ప్రారంభం అయిన నిమిషాల్లోనే ఎన్టీఆర్ కటౌట్ మొత్తం మసి అయిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎన్టీఆర్ కటౌట్ కాలిపోతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.