AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పదేళ్లలో వందేళ్ల విధ్వంసం.. తెలంగాణ అభివృద్ధిలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలి

మాతృభూమి రుణం తీర్చుకోండి
సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
అలాగే ఉచితాలపైనా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
అమెరికాలో సీఎం బిజీబిజీ

(అమ్మన్యూస్, వాషింగ్టన్‌):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. సోమవారం కాగ్నిజెంట్‌ సీఈఓతో సీఎం భేటీ కానున్నారు. సిగ్న కంపెనీ సీనియర్‌లతో రేవంత్‌ చర్చలు జరపనున్నారు. అమెరికాలో ఉన్న కాన్సల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాతో జరిగే మీటింగ్‌లో పాల్గొననున్నారు. అలాగే పలు కంపెనీల ఓనర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఎన్‌ఆర్‌ఐలతో జరిగిన సమావేశంలో రేవంత్‌ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌ విజయంలో ఎన్‌ఆర్‌ఐల సహకారం ఉందని పేర్కొన్నారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగిందని విమర్శించారు. ఎనిమిది నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన పనులను ఎన్‌ఆర్‌ఐలకు సీఎం వివరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని వ్యాఖ్యానించారు. అలాగే ఉచితాలపైనా రేవంత్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు.

పెట్టుబడులే లక్ష్యంగా..
కాగా.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా.. సీఎం రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగుతోంది. పది రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, పలువురు ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. శనివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి న్యూయార్క్‌కు సీఎం బయలుదేరి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నానికి న్యూయార్క్‌ నగరానికి చేరుకున్నారు. న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులో రేవంత్‌ బృందానికి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. న్యూయార్క్‌లో ఆరు రోజుల పర్యటన తర్వాత దక్షిణ కొరియాకు వెళ్తారు. ఈ పది రోజుల పాటు పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు. రూ.50 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు ఉంటాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10