AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్‌ పేపరే కావాలి : మల్లికార్జున్‌ ఖర్గే

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌లతో ఓటింగ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని, వాటికి బదులుగా ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్స్‌నే వినియోగించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈవీఎంలలో ఎలాంటి లోపాలు లేవని, ఈవీఎంలకు వ్యతిరేకంగా వచ్చే ఫిర్యాదులను తాము ఎంటర్‌టైన్‌ చేయదల్చుకోలేదని కేఏ పాల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘ఈవీఎంలను పక్కన పెట్టాలంటే మనం అందరం ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. నేను ఎన్నికల గురించి మాట్లాడాలనుకోవడం లేదు. అయితే ఈవీఎంల కారణంగా పేద, బడుగు బలహీన వర్గాల ఓట్లు వృథా అవుతున్నాయి. వాళ్లంతా బ్యాలెట్‌ పేపర్‌ ఓటింగ్‌నే కోరుకుంటున్నారు’ అని ఖర్గే చెప్పారు. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగిన సంవిధాన్‌ రక్షక్‌ అభియాన్‌ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు.

‘ఈవీఎంలు వాళ్ల దగ్గరే పెట్టుకోనివ్వండి. మాకు ఈవీఎంలు వద్దు. మేం బ్యాలెట్‌ పేపర్‌తో జరిగే ఓటింగ్‌ను కోరుకుంటున్నాం.’ అని ఖర్గే అన్నారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ కోసం రాహుల్‌గాంధీ మరోసారి భారత్‌ జోడో యాత్ర చేయాలని ఖర్గే కోరారు. బ్యాలెట్‌ పేపర్‌ ఓటింగ్‌ అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని అన్నారు. అందుకోసం ఇతర రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడుతామని చెప్పారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10