– పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు
– రాష్ట్ర ప్రగతే పరమావధిగా కీలక నిర్ణయాలు
– రుణమాఫీ, ‘గృహలక్ష్మి’, సీఎంఆర్ఎఫ్.., ఉచిత బస్సు అమలులో రికార్డులు..
– తక్కువ సమయంలో అధిక సంఖ్యలో ఉద్యోగాలు..
– ‘రైతు భరోసా’ దిశగా వడివడిగా అడుగులు..
– పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న లీడర్
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ ఏడాది పాలన పూర్తవుతోంది. రేవంత్రెడ్డి సీఎం అయిన నాటి నుంచి.. నేటి వరకూ విశ్రమించలేదు. పేదల సంక్షేమమే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రగతే ముఖ్యమంటూ నిత్యం కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా తన దైన ముద్ర కోసం కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ తన నాయకత్వ సమర్థత నిరూపించారు. ఏడాది కాలం లోనే తెలంగాణలో కొత్త రికార్డులు నెలకొల్పారు.
దూసుకుపోతున్న సక్సెస్ రేటు
ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వ కొలువు తీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రేవంత్ సక్సెస్ రేటు దూసుకుపోతోంది. రాజకీయంగానే కాదు..ప్రభుత్వాధినేత గానూ రేవంత్ తన మార్క్ నిరూపించుకున్నారు. మంత్రివర్గ సహచరులు.. తన టీం తో కలిసి కొత్త విజయాలు నమోదు చేశారు. ఏడాది కాలంలో రేవంత్ సాధించిన విజయాలను తెలంగాణ సీఎంఓ అంశాల వారీగా వెల్లడించింది. దేశంలో ఏ రాష్ట్రంలో.. ఎప్పుడూ చేయని విధంగా .. ఆర్థిక కష్టాలు ఉన్నా రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేసి కొత్త రికార్డు నెలకొల్పారు. అదే విధంగా దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత అతి తక్కువ సమయంలో అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత రేవంత్ ప్రభుత్వానికే దక్కింది.
హైదరాబాద్ బ్రాండ్ పెంచేలా మూసీకి కొత్త శోభ..
హైదరాబాద్ బ్రాండ్ పెంచేలా మూసీ ప్రక్షాళన.. రాష్ట్రంలో ఆక్రమణలకు గురవుతూ వస్తున్న చెరువులు, కుంటల పునరుద్ధరణ మొదలైంది. 40 ఏళ్ల తరువాత ఆక్రమణలు నిలిచిపోయాయి. ఎంతో ఘన చరిత్ర ఉన్నా నాటి పాలకుల నిర్లక్ష్యంతో కలుషితమై .. నిరుపయోగంగా మారిన మూసీ నదిని 50 ఏళ్ల తరువాత రేవంత్ పాలనలో కొత్త శోభ సంతరించుకుంటోంది. మరోవైపు సన్నాలు పండించిన రైతులకు బోనస్ అందిస్తున్నారు. 1947 నుంచి ఏ రాష్ట్రం లోనూ లేని విధంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరిగింది.
స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు..
రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా అద్భుతమైన నగరంగా హైదరాబాద్ స్థిరమైన వృద్ధి సాధించేలా రేవంత్ పక్కా ప్రణాళికా బద్దంగా అడుగులు వేస్తున్నారు. దేశంలోనే తొలి సారిగా స్కిల్ యూనివర్సిటీని రేవంత్ ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద క్రీడా విశ్వవిద్యాలయం రేవంత్ నాయకత్వంలో ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.
‘గ్యారంటీ’గా అమలు చేస్తూ..
ఆరు గ్యారంటీలపై ప్రజలకు ఇచ్చిన హామీల అమలు లోనూ రేవంత్ ముందు వరుసలో నిలిచారు. మహిళలకు ఉచిత బస్సు, రూ. 500 వంట గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగం ఉన్న ఇళ్లకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవుతోంది. హైదరాబాద్ లో కాలుష్యం తగ్గించేందుకు నగరంలోని అన్ని పెట్రోల్, డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి..వాటి స్థానంలో 3,000 ప్లస్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడుతున్నారు. అదే విధంగా నగరంలోని బాపూ ఘాట్లో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నగర ప్రజల అవసరాలకు గోదావరి నుంచి తాగునీరు అందిస్తున్నారు. హైదరాబాద్ ఖ్యాతి మరింత పెంచేలా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు ధీటుగా నాలుగో నగరం గా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధం అవుతోంది.
హాస్టల్ విద్యార్థులకు..
రాష్ట్రంలో పదేళ్లు నిర్లక్ష్యానికి గురైన రెసిడెన్షియల్ పాఠశాల పిల్లలకు రేవంత్ ప్రభుత్వంలో ఆహారం కాస్మోటిక్ బడ్జెట్లు పెరిగాయి. భవిష్యత్ కోసం నిర్ణయాలు మహిళలకు రేవంత్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అండగా నిలుస్తున్నారు. కోటి మంది మహిళా కోటీశ్వరులను సృష్టించేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలను..మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దేందుకు రుణాలు అందిస్తున్నారు. రాష్ట్రలో సర్వే నిర్వహిస్తూ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి అభ్యున్నతి దిశగా అడగులు వేస్తున్నారు. రెసిడెన్షియన్ పాఠశాలల నిర్వ హణ లో సంస్కరణలు ప్రవేశ పెట్టారు. దళిత, గిరిజన, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కొత్త క్యాంపస్లు అందుబాటులోకి వస్తున్నాయి. అవినీతికి చిరునామాగా మారిన ధరణి పోర్టల్ సంస్కరణ బాధ్యతలు ఎన్ఐసీకి అప్పగించారు. ముఖ్యమంత్రి అంటే సేవకుడు మాత్రమే అనేలా.. గత పాలకులకు భిన్నంగా సామాన్యులు కలిసే అవకాశం కల్పించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సామాన్యులు వెళ్లే వెసులుబాటు కల్పిస్తూ అందరి చేత శెభాష్ అనిపించుకుంటున్నారు.