బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీకి ఎంతో అనుబంధం ఉంది. హైదరాబాద్ వచ్చినపుడు తప్పనిసరిగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వెళ్లే నీతా అంబానీ తాజాగా బుధవారం కూడా వెళ్లారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు వచ్చిన నీతా అంబానీ.. అందులో భాగంగానే బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని కూడా సందర్శించారు.
ఈ క్రమంలోనే బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్న నీతా అంబానీకి ఆలయం అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నీతా అంబానీ.. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బల్కంపేట ఆలయంలో నీతా అంబానీ పూజలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక మ్యాచ్ సమయంలో నీతా అంబానీ.. బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకుంటే విజయం ముంబై ఇండియన్స్దేనని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. గతంలో కూడా ఐపీఎల్ మ్యాచ్ల కోసం హైదరాబాద్కు వచ్చిన నీతా అంబానీ.. బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు.