AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఘనంగా నిఖిల్ కుమారుడి బారసాల..

టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ కుమారుడి బారసాల, నామకరణ మహోత్సవం నిన్న ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక నిర్వహించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నిఖిల్ భార్య పల్లవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. తమను తల్లిదండ్రులుగా ఎంచుకుని తమ జీవితాలను మార్చేశావంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ తగిలించారు. కుమారుడి పేరు కూడా వెల్లడించలేదు.

ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పల్లవి మగబిడ్డకు జన్మనిచ్చారు. బారసాల ఫోటోలను షేర్ చేసిన పల్లవి కుమారుడి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. నిఖిల్ ప్రస్తుతం స్వయంభు అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీతోపాటు రాంచరణ్ నిర్మాణంలో ఇండియా‌ హౌస్ అనే సినిమాలోనూ నిఖిల్ నటిస్తున్నాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10