హైదరాబాద్ : పదవులు శాశ్వతం కాదని, చేసిన పనులే చరిత్రలో నిలిచిపోతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను క్రమంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఏది ఏమైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఆరు గ్యారంటీలతో(Six Guarantees) పాటు ఇతర హామీలను కూడా నెరవేరుస్తామన్నారు. అలాగే త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్ కార్డులు(New ration cards) పంపిణీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ధరణిలో సవరణలు చేసి ఎలాంటి సమస్యలు లేకుండా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.