AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాన్‌ కార్డు 2.0… త్వరలో క్యూఆర్‌ కోడ్‌తో కొత్తవి జారీ.. ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

పన్ను చెల్లింపుదారులందరికీ కార్డు ఉచితం..
కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు 2.0 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది. త్వరలోనే క్యూఆర్ కార్డుతో కొత్త పాన్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా రూ.1435 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ప్రాజెక్టుపై ప్రకటన వెలువడిన క్రమంలో ట్యాక్స్ పేయర్లలో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ పాన్ కార్డులు జారీ చేయనున్న నేపథ్యంలో పాత పాన్ కార్డు పని చేస్తుందా లేదా? కొత్త పాన్ కార్డు తీసుకోవాలంటే ఏం చేయాలి, ఎవరికి వర్తిస్తుంది? అని అడుగుతున్నారు. అయితే ఇలాంటి ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్టు చేపడుతున్న క్రమంలో త్వరలోనే క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డులు జారీ కానున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పాన్ కార్డు కలిగి ఉన్న వారు, ట్యాక్స్ పేయర్లలో పలు సందేహాలు తిరుగుతున్నాయి. అయితే, పాన్ కార్డు 2.0 అనేది పాత పాన్ కార్డుకు అప్‌గ్రెడేషన్ ప్రాజెక్ట్ మాత్రమే. కొత్త పాన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కొత్త కార్డులను ఉచితంగా పొందవచ్చు. ఆన్‌లైన్ ద్వారానే పూర్తిగా ఉచితంగా కొత్త కార్డులను పొందవచ్చు. పాత పాన్ కార్డులు పని చేస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులందరికీ కొత్త పాన్ కార్డులను ఉచితంగా జారీ చేయనున్నట్లు తెలిపింది. డిజిటల్ ఇండియా విజన్‌ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు తెలిపింది.

పన్ను చెల్లింపుదారులకు మరితం ఈజీగా డిజిటల్ సేవలు అందించేందుకు ఈ పాన్ 2.0 ప్రాజెక్టు తీసుకొస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కొత్త పాన్ కార్డు ద్వారా ట్యాక్స్ పేయర్ల రిజిస్ట్రేషన్, ఇతర సేవలు వేగవంతమవుతాయని తెలిపింది. పన్ను చెల్లింపుదారుల డేటా మొత్తం ఒకే చోట లభిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో జారీ అయిన పాన్ కార్డుల్లో 98 శాతం పాత పాన్ కార్డు హోల్డర్లే ఉన్నారు. పాన్ 2.0 అనేది ప్రస్తుత పాన్ ఐటీ సిస్టమ్‌కి అప్‌గ్రేడ్ వర్షన్ వంటిది. డూప్లికేషన్ తగ్గించడం, క్రాస్ సెక్షన్ వెరిఫికేషన్, సులభంగా అథెంటికేట్ చేయడం, డిజిటల్ యుటిలిటీ మెరుగుపరచడం అనేవి ఈ కొత్త ప్రాజెక్టు లక్ష్యాలు. ఇప్పటికే ఉన్న పాన్ కార్డుదారులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ఉచితంగా కొత్త కార్డులను జారీ చేయనుంది. అయితే ముందుగా ట్యాక్స్ పేయర్లకు కొత్త కార్డులు జారీ చేయనున్నారని తెలుస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10