దేశ పౌరులకు తప్పకుండా ఉండాల్సిన రెండు కార్డులలో ఒకటి ఆధార్ కాగా, మరొకటి పాన్ కార్డు. కేంద్ర ప్రభుత్వం తాజాగా సరికొత్త పాన్ కార్డును అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అందులో భాగంగానే పాన్ 2.0 ప్రాజెక్టును మొదలుపెట్టింది. ఆర్థిక అవకతవకలు, సమాచార దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు కొత్త పాన్ కార్డును పరిచయం చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవాళ్లు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండానే, ఆటోమేటిక్ గా అప్ గ్రేడ్ చేయబడుతారని కేంద్రం తెలిపింది. కొత్త పాన్ కార్డులు అత్యాధుక సేఫ్టీ ఫీచర్లతో క్యూఆర్ కోడ్ ను కలిగి ఉంటాయి. ఆదాయపన్ను చెల్లించే వాళ్లు సులభంగా, వేగంగా సేవలను పొందేందుకు ఉపయోగపడనుంది. కొత్త పాన్ కార్డులను పన్ను చెల్లించే వారికి ఉచితం అందించనున్నట్లు కేంద్రం తెలిపింది.
పాన్ 2.0 పొందాలంటే ఎలా?
పాన్ 2.0 పొందాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ కార్డ్, ఓటరు ID, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డులతో పాటు యుటిలిటీ బిల్లులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు లేదంటే అడ్రస్ ఫ్రూప్ అందించాలి. డేట్ ఆఫ్ బర్త్ ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికేట్ అవసరం.
ముందుగా NSDL వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
⦿మీ పాన్, ఆధార్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి.
⦿అవసరమైన సమాచారాన్ని అందించాలి.
⦿మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. ఓటీపీ కేవలం 10 నిమిషాల పాటు చెల్లుబాటు అవుతుంది.
⦿కండీషన్స్ ను యాక్సెప్ట్ చేసి కార్డుకు అవసరం అయిన పేమెంట్ చేయాలి.
⦿ఈ ప్రాసెస్ కు అంతా పూర్తి కావడానికి సుమారు అరగంట సమయం పడుతుంది.
⦿మీ పేమెంట్ కంప్లీట్ కాగానే మీ PAN వెంటనే ఇ మెయిల్ కి వస్తుంది.
⦿ఆదాయపు పన్ను శాఖలో పాన్ రికార్డుల ప్రకారం అందుబాటులో ఇ మెయిల్ కు మాత్రమే ఇ పాన్ వస్తుంది.
UTIITSL ద్వారా పాన్ 2.0ని ఎలా పొందాలంటే?
⦿ముందుగా https://www.utiitsl.comను ఓపెన్ చేయాలి.
⦿PAN, డేట్ ఆఫర్ బర్త్, క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేయాలి.
⦿మీ ఇమెయిల్ రిజిస్టర్ కానట్లయితే, ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైన తర్వాత PAN 2.0 కింద అప్‌డేట్ చేయండి.
⦿అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేసి, పేమెంట్స్ చేస్తే సరిపోతుంది.
⦿ మీ ఇ-పాన్ PDF ఫార్మాట్‌లో మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ IDకి డెలివరీ చేయబడుతుంది.
⦿గత 30 రోజులలో జారీ చేయబడిన e-PANలు ఉచితంగా ఇచ్చారు. ఇకపై కొంత ఛార్జీ వసూలు చేయనున్నారు.
పాన్ 2.0తో లాభాలు ఏంటి?
పాన్ 2.0తో చాలా లాభాలున్నాయి. వీటితో అత్యంత వేగవంతమైన సేవలు పొందే అవకాశం ఉంటుంది. అధునాతన QR-ప్రారంభించబడిన ఫీచర్‌లతో మెరుగైన భద్రత ఉంటుంది. గత కార్డుతో పోల్చితే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.