AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నీట్ ఫలితాలపై గందరగోళం.. విద్యా శాఖ స్పష్టత

నీట్ యూజీ సవరించిన ఫలితాలు విడుదలైనట్టు వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఎన్టీయే వెబ్ సైట్‌లో నీట్ రివైజ్డ్ స్కోర్ కార్డు పేరిట ఓ లింక్ కూడా కనిపించింది. దీంతో సుప్రీంకోర్టు నేపథ్యంలో సవరించిన ఫలితాలు విడుదలయ్యాయే అందరూ అనుకున్నారు. కానీ, తీరా ఆ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ కాకపోవడంతో గందరగోళం నెలకొంది. విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ గందరగోళం నేపథ్యంలోనే విద్యా శాఖ స్పష్టత ఇచ్చింది.

రివైజ్డ్ రిజల్ట్ ఇంకా రిలీజ్ చేయలేదని, ఎన్టీయే వెబ్ సైట్‌లో ఉన్నది పాత లింకు అని విద్యా శాఖ వివరణ ఇచ్చింది. ఆ లింక్ చూసి స్కోర్ కార్డులు ప్రకటించినట్టుగా భావించి ఉంటారని, కానీ, సవరించిన స్కోరు కార్డులు ఇంకా విడుదల చేయలేదని స్పష్టత ఇచ్చింది. త్వరలోనే ఫలితాలపై అధికారిక ప్రకటన ఉంటుందని తెలిపింది.

ఎన్టీయే యూజీ పరీక్షచుట్టు ఉన్న వివాదంపై ఈ రోజు సుప్రీంకోర్టు తుది విచారణ చేపట్టింది. దీంతో ఎన్టీయే నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల చేసిందని అనుకున్నారు. ఎన్టీయే వెబ్ సైట్‌లో కూడా అలా లింక్ కనిపించడంతో కన్ఫ్యూజ్ అయ్యారు. దీనికి తోడు వివాదాస్పద ఫిజిక్స్‌లో 19వ ప్రశ్నకు సమాధానంపై కూడా సుప్రీంకోర్టు ఈ రోజు క్లారిటీ ఇచ్చింది. ఆప్షన్ 4ను సరైన సమాధానంగా స్వీకరించాలని సూచించింది. దీంతో ఈ సమాధానంతో రివైజ్ చేసిన ఫలితాలను విడుదల చేసి ఉంటుందని భావించారు. సవరించిన ఫలితాలు విడుదలయ్యాక https://exams.nta.ac.in/ ఈ వెబ్ సైట్‌లో చూసుకోవచ్చు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10