మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దేశం ఒక విశిష్ట నాయకుడిని కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
భారతదేశం తన అత్యంత విశిష్ట నాయకులలో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ జీని కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. నిరాడంబరమైన మూలాల నుంచి వచ్చినప్పటికీ.. క్రమంగా ఎదిగి, గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగాడు. అతను ఆర్థిక మంత్రిగా సహా వివిధ ప్రభుత్వ పదవులలో పనిచేశారు. సంవత్సరాలుగా మన ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారు. పార్లమెంట్‌లో ఆయన చేసిన జోక్యాలు కూడా తెలివైనవి. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు మన్మోహన్ సింగ్ విస్తృతంగా కృషి చేశారని మోడీ ప్రశంసించారు.