తన ఫామ్‌హౌస్ కూల్చాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి చెబుతున్నారని.. తన ఫామ్ హౌస్ రూల్‌కు వ్యతిరేకంగా ఉందంటే తానే కూల్చి వేస్తానని మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. తానే బాధ్యత తీసుకుని కూల్చుతానని స్పష్టం చేశారు. ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై పట్నం మహేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… రూల్ ప్రకారమే ఉందని అధికారులు ఒక రిపోర్ట్ ఇచ్చారని గుర్తుచేశారు. ఇల్లీగల్ అంటే కేటీఆర్ రావాలని.. తానే వచ్చి కూల్చుతానని సవాల్ విసిరారు. తన ఫామ్ హౌస్ లీగల్‌గా ఉందని అన్నారు. అక్కడ మామిడి తోట వ్యవసాయం ఉందని తెలిపారు. అధికారులను అడిగే తానే కట్టానని పట్నం మహేందర్ రెడ్డి తేల్చిచెప్పారు.
తన ఫామ్ హౌస్ బఫర్ జోన్‌లో లేదు FTLలో లేదని అన్నారు. అధికారులు వచ్చి లీగల్‌గా ఉందని చెప్పారని అన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, సబితా, హరీష్ రావు ఎవరి ఫామ్ హౌస్ ఇల్లీగల్‌గా ఉన్నా కూల్చాల్సిందేనని చెప్పారు. 111జీఓ రాష్ట్రం పరిధిలో లేదని అన్నారు. అది సుప్రీంకోర్టు పరిధిలో ఉందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 111జీవో పై ముందుకు వెళ్లాలని మహేందర్ రెడ్డి వెల్లడించారు.