AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాగార్జున, సమంతలపై ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కొండా సురేఖ, అక్కినేని నాగార్జున ఫ్యామిలీపైన, సమంత నాగచైతన్య విడాకులపైన చేసిన సంచలన వ్యాఖ్యల దుమారం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది.  అయినప్పటికీ కొండా సురేఖ వ్యాఖ్యల పైన అక్కినేని ఫ్యామిలీ మాత్రం వెనక్కు తగ్గలేదు. నాగార్జున ఏకంగా కొండా సురేఖ పైన పరువు నష్టం దావా సివిల్, క్రిమినల్ కేసులను వేసి ఆమెపై సమర శంఖాన్ని పూరించారు. ఇక ఇదే సమయంలో తాజాగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అక్కినేని నాగార్జున, సమంతల పైన కీలక వ్యాఖ్యలు చేశారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై రఘునందన్ రావు వ్యాఖ్యలు ఇటీవల ఒక మీడియా ఛానల్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కినేని నాగార్జున పైన, సమంత పైన రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు.

అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని పేర్కొన్న ఆయన 2016 లోనే హెచ్ఎండిఏ దీనిపై రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. అది అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు కూల్చలేదు అనేది నేటికీ పెద్ద ప్రశ్న అంటూ మాట్లాడారు.

సమంత ఒక్కసారిగా చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ ఎలా అయ్యారు ఇదే సమయంలో నాగర్జున కోడలుగా ఉన్న సమంత పైన కూడా ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో నాగార్జున కోడలుగా ఉన్న సమంత ఒక్కసారిగా చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. అసలు సమంతకు చేనేత రంగం గురించి ఏం తెలుసు అని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.

రంగుల లోకంతో ఉన్న రక్తసంబంధం ఏంటో చెప్పాలి? అప్పటి ప్రభుత్వానికి రంగుల లోకంతో ఉన్న రక్తసంబంధం ఏంటో చెప్పాలి అంటూ రఘునందన్ రావు షాకింగ్ డిమాండ్ పెట్టారు. అప్పట్లో ప్రభుత్వానికి అక్కినేని ఫ్యామిలీకి ఉన్న సంబంధాలు ఏమిటో వాళ్లే చెప్పాలంటూ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా నాగార్జున, సమంతల పైన జరుగుతున్న రగడకు రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్టుగా తెలుస్తుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10