AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హనుమంతుడి ఆలయంలో గదతో వానరం.. వైరల్ వీడియో ఇదిగో!

అదొక ఆంజనేయ స్వామి ఆలయం… అక్కడికి ఒక వానరం వచ్చింది. హనుమంతుడి గద తీసుకుని భుజంపై పెట్టుకుని కూర్చుంది. అది చూసిన భక్తులు ఆ వానరానికి బొట్టు పెట్టి, దండ వేశారు. ఆ తర్వాత కూడా వానరం అలా… ఆంజనేయస్వామి విగ్రహం ముందే గద పట్టుకుని కూర్చుంది. ఇది తెలిసిన చాలా మంది హనుమంతుడే తమను దీవించడానికి ఇలా వచ్చాడంటూ ఆ ఆలయానికి పోటెత్తారట.

ఇది ఎక్కడ జరిగిందో, ఎవరు మొదట వీడియో తీసి అప్ లోడ్ చేశారనే స్పష్టత లేదు. కానీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఈ వీడియో వైరల్ గా మారింది. చాలా అకౌంట్లలో ఈ వీడియోను అప్ లోడ్ చేస్తున్నారు. వేల కొద్దీ వ్యూస్ నమోదవుతున్నాయి.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10