AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోహన్‌బాబుకు హైపర్‌ టెన్షన్‌.. స్థిమితంగా ఉండలేకపోతున్నారు..

విపరీతంగా పెరిగిన బీపీ
హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన డాక్టర్లు
ఇంకా రెండు రోజులు చికిత్స అవసరమని వెల్లడి

హైపర్‌ టెన్షన్, విపరీతంగా పెరిగిన బీపీతో నటుడు మోహన్‌బాబు స్థితిమితంగా ఉండలేకపోతున్నారని డాక్టర్లు వెల్లడించారు. ఈ మేరకు వారు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. మంచు ఫ్యామిలీ వివాదం గంటకో మలుపు తిరుగుతుంది. ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన విషయాలను తండ్రీకొడుకుల గొడవ కారణంగా మీడియా ఎక్కడంతో వారి వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే హాట్‌ టాపిక్‌గా మారింది. అలాగే మోహన్‌ బాబు మంగళవారం రాత్రి.. ఓ టీవీ రిపోర్టర్‌ పై దాడి చేయడం.. సంచలనంగా మారింది. అయితే ఈ దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మోహన్‌ బాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ.. ధర్నాలు చేస్తున్నారు.

రిపోర్టర్‌ పై దాడి చేసిన నటుడు మోహన్‌ బాబు.. నేరుగా కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చేరారు. దీంతో అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స అనంతరం పలు టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్య బృందం.. మోహన్‌ బాబు ఆరోగ్య పరిస్థితిపై వివరాలను మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఓ డాక్టర్‌ మాట్లాడుతూ.. ‘నటుడు మోహన్‌ బాబుకు బీపీ, హైపర్‌ టెన్షన్‌ ఉన్నాయి. దీంతో ఆయన స్థిమితంగా ఉండలేక పోతున్నారు. దీంతో ఆయన చుట్టూ ఏం జరుగుతుందో మోహన్‌ బాబుకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నాం. ఆయన హార్ట్‌ రేట్‌ ఎక్కువగా ఉందని, కన్ను కింద ఇంకా వాపు ఉందనని.. కనీసం రెండు రోజుల పాటు ఆయనకు చికిత్స అవసరం’ అని కాంటినెంటల్‌ ఆస్పత్రి డాక్టర్లు మీడియాతో తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10